ఈ నెల 13వ తేదీన భారీ రిలీజ్...

2024-01-02 19:09:00

వెంకటేశ్ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ... వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నారు.

సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఆయన ఇంతవరకూ 74 సినిమాలను చేశారు. 75వ సినిమాగా చేసిన 'సైంధవ్' ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది.

శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా నడవనుంది.ఈ మధ్య కాలంలో ఈ తరహా కథల్లో వెంకటేశ్ కనిపించలేదు.

అందువలన ఆయన లుక్ దగ్గర నుంచి అందరిలో ఈ సినిమా ఆసక్తిని పెంచుతోంది. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ చూస్తే, ఈ సినిమా తప్పకుండా వెంకటేశ్ కెరియర్లో ప్రత్యేక స్థానంలో నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. షూటింగు స్పాట్ లో వెంకీ... శైలేశ్ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవడం, వెంకటేశ్ కి సీరియస్ గా ఏదో సీన్ గురించి శైలేశ్ వివరిస్తుండటం...

ఇద్దరూ లొకేషన్లో సరదాగా మాట్లాడుకోవడం... అలా లొకేషన్ లో వాక్ చేయడం ఈ స్టిల్స్ లో కనిపిస్తోంది. సంఖ్యా పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా కావడం వలన మరింత ప్రాముఖ్యతను...

ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కారణంగానే ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →